News

తెలుగు రాష్ట్రాలు మరో ఘనత సాధించాయి


అభివృద్ధిలో పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలు మరో ఘనత సాధించాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన సులభతర వాణిజ్య అనుకూల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సంయుక్తంగా తొలి ర్యాంక్‌ సాధించాయి. ఈ జాబితాలో రెండు రాష్ట్రాలు 98.78 మార్కులు సాధించాయి. అనుమతులను ఏకగవాక్ష పద్ధతిని అమల్లోకి తేవడం ద్వారా తెలుగు రాష్ట్రాలు ఈ ఘనత సాధించినట్లు వాణిజ్యశాఖ పేర్కొంది. ఈ జాబితాలో మూడోస్థానంలో గుజరాత్‌, నాలుగో స్థానంలో ఛత్తీస్‌గఢ్‌, ఐదో స్థానంలో మధ్యప్రదేశ్‌ నిలిచాయి. 2015లో విడుదల చేసిన జాబితాలో గుజరాత్‌ అగ్రస్థానం సాధించగా... ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి. అయితే ఈ ఏడాది గుజరాత్‌ను వెనక్కి నెట్టి తెలుగు రాష్ట్రాలు తొలి ర్యాంక్‌ సాధించడం విశేషం.